మార్చి 31న డప్పులు మోగించండి: కాంగ్రెస్ - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి 31న డప్పులు మోగించండి: కాంగ్రెస్

March 26, 2022

31

మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, వారం రోజులపాటు కార్యకర్తలు వినూత్న నిరసనలు చేపట్టాలని తెలిపింది. ఈ సందర్భంగా శనివారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్దేవాలా మీడియాతో మాట్లాడుతూ.. ”దేశ ప్రజలంతా వారి వారి ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ప్రదర్శిస్తూ, డప్పులు కొడుతూ గంటలు మోగించాలి. గత ఎనిమిదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో మోదీ సర్కార్ ప్రజల జేబుల్లోంచి రూ. లక్షల కోట్లు దోచుకుంది. గత రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ ధర రూ. 20లు, డీజిల్ ధర రూ. 28, 68లు పెంచారు. ఐదు రోజుల్లో నాలుగోసారి (ఈరోజు) లీటరు పెట్రోల్, డీజిల్ పై 80 పైసలకు పైగా పెంచేశారు. దీంతో సామాన్యులు, గృహిణులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అవస్థలు ఎదుర్కొంటున్నారు” అని అన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జిలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషనల్) కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన దిల్లీలో సమావేశం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యత్వ నమోదు డ్రైవ్ తో పాటు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ పై చర్చించారు.