పిడకల దండ పొడవు 400 అడుగులు.. ఆరోగ్యానికి మంచిదని..  - MicTv.in - Telugu News
mictv telugu

పిడకల దండ పొడవు 400 అడుగులు.. ఆరోగ్యానికి మంచిదని.. 

January 14, 2020

nhjknhb

సంక్రాంతిని వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ రోజు భోగిమంటలను ఉత్సాహంగా రగిలించి చలి కాచుకున్నారు. సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరైన ఉభయ గోదావరి జిల్లాల్లో పిడకల దండలు ఆకట్టుకున్నాయి. భోగిమంటల్లో పిడకలను కాల్చడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. పిడకలను దండలా గుచ్చి మంటల్లో వేస్తారు. ఇవి అడుగు నుంచి వంద అడుగులు వరకు ఉంటాయి. 

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలంలోని రంగాపురంలో శ్రీరామసత్య అనే మహిళ ఏకంగా 400 అడుగుల పొడవైన పిడకల దండ గుచ్చారు. ఇంట్లోని ఆవులు వేసిన పేడతోనే వీటిని తయారు చేయడం విశేషం. దీన్ని చూడ్డానికి జనం ఆసక్తికనబరిచారు. పిడకల దండలపై పిల్లలకు ఆసక్తి కలిగించడానికి దీన్ని తయారు చేశానని సత్య చెప్పారు. పిడకలను కాల్చడం వల్ల చుట్టుపక్కల సూక్ష్మజీవులు చనిపోతాయని నమ్మకం.