ప్రపంచానికి కరోనా అంటించి దిద్దుకోలేని తప్పుచేసిన చైనా మీద యావత్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. కరోనా విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయని చైనా వైఖరి అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో బెంగాల్ ప్రజలు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ విగ్రహం తలను నరికేశారు. బెంగాల్లో దసరా సందర్భంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఏటా దుర్గామాత విగ్రహాల ఏర్పాటులో బెంగాలీలు వైవిద్యాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే రకమైన విధానాన్ని వారు ఫాలో అయ్యారు. బెంగాల్‌లోని బెరంపూర్లో అమ్మవారి చేతిలో హతమయ్యే అసరుడి స్థానంలో ఈసారి వారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బొమ్మను ఉంచారు. కరోనా వైరస్‌తో ప్రపంచం ఉసురు తీయడమే కాకుండా సరిహద్దుల్లో 20 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన చైనాపై వారు ఈ రకంగా నిరసన తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.