కాళికాదేవి విగ్రహాలకు బదులు వలస కూలీ మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

కాళికాదేవి విగ్రహాలకు బదులు వలస కూలీ మహిళ

October 16, 2020

ngnfg

దసరా వచ్చిందంటే పశ్చిమ బెంగాల్‌లో ప్రతీ వీధిలో కాళికాదేవి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. నవరాత్రులు అమ్మవారికి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం అక్కడి ప్రజలు భిన్నంగా ఆలోచించారు. అమ్మవారి అవతారాన్ని వలస  కూలీ తల్లులను అమ్మావారి రూపంలో కొలువుదీర్చాలని నిర్ణయించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలు తమ బిడ్డలను చంకలో వేసుకొని వేల కిలోమీటర్లు నడిచి వచ్చిన సందర్భాన్ని గుర్తి చేస్తూ ఈ విధంగా చేయబోతున్నారు. బెహలా ప్రాంతానికి చెందిన బారిష క్లబ్ దుర్గా పూజా కమిటీ ఈ విగ్రహాలను నెలకొల్పబోతోంది. 

లాక్‌డౌన్ సమయంలో లక్షలాది కార్మికులు దక్షిణాది నుంచి ఉత్తరాదికి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. చంటి బిడ్డలను కూడా ఎత్తుకొని మహిళలు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. తమ పిలల్లను మోస్తూ సాగించిన ప్రయాణం స్త్రీశక్తికి అద్దం పట్టింది. అందుకే వలస కార్మిక మహిళలను అపర కాళికలా పూజిస్తామని బెంగాలీలు చెబుతున్నారు. దసరా పండుగ సందర్భంగా చాలా మండపాల్లో కాళిక విగ్రహాలకు బదులుగా వసల కార్మిక కుటుంబాలకు చెందిన మహిళల విగ్రహాలను ఉంచబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విగ్రహాలు కూడా సిద్ధం చేశారు. చేతిలో చంటిబిడ్డ మరోవైపు సంచులను మోస్తూ.. వారు ఎలా కనిపించారో, అదే రూపంలో వలస కార్మిక మహిళల విగ్రహాలను రూపొందించారు. వారి తెగువ అమ్మవారిని గుర్తు చేశాయని స్థానికులు అంటున్నారు. అందుకే అమ్మవారిలా వారిని పూజించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.