Durga Puja mandapam with pets..do you know why?
mictv telugu

పెంపుడు జంతువులతో దుర్గాపూజ మండపం..ఎందుకంటే?

September 30, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో దుర్గాదేవి నవరాత్రి వ్రత దీక్షలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండపాల నిర్వహకులు, భక్తులు నిత్యం అమ్మవారి విగ్రహాలకు  పూజలు చేస్తూ, ప్రత్యేక నైవేథ్యాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు ఎక్కడ, ఏ చిన్న అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

అయితే, పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని పోలీసులు.. దుర్గాదేవి విగ్రహం దగ్గర రెండు శునకాలతో కూడిన ఓ మండపాన్ని ఏర్పాటు చేశారు. చాలా వెరైటీగా దుర్గాదేవి చిత్రం దగ్గర రెండు శునకాలు ఉన్నట్లుగా విగ్రహాన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ డిజైన్  సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అట్లాస్ క్లబ్ సభ్యులు, భిదాన్ సరనీ ఈ మంటపాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. “మా డాగ్ స్క్వాడ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు ఆ దుర్గాదేవి మంటపానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు” అంటూ కోల్‌కతా పోలీసులు షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

అయితే, ఎందుకిలా అమ్మవారి విగ్రహం వద్ద పెంపుడు జంతువులను ఏర్పాటు చేశాము అనే దానిపై పోలీసులు మాట్లాడుతూ..”కోల్‌కతా నగరంలో మొదటిసారిగా పోలీసు జాగిలాలు ఉండే ఒక దుర్గామాత మంటపాన్ని ఏర్పాటు చేశాం. ఈ మంటపం పలువురుని ఇట్టే ఆకర్షిస్తోంది. అమ్మవారి పాదాల వద్ద డాగ్ స్క్వాడ్ సభ్యులు అయిన..లాబ్రడార్స్ మోలీ, కర్పూరం, జర్మన్ షెఫర్డ్‌లు లిజా, డింకీలు (కుక్కల పేర్లు వాటి జాతులు) ముఖ్య అతిథులుగా హాజరైనట్లుగా నిర్మించాం. కోల్‌కతాలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే ఈ మండపాన్ని ఏర్పాటు చేశాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది దేశవ్యాప్తంగా రోజురోజుకూ మారుతోంది. జనాలతో పోలీసులు మరింత మమేకం అవుతూ, వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. సాధారణ ప్రజల్లో పోలీసులు అంటే ఉన్న భయాన్ని తొలగించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం” అని అన్నారు.