సగం తగ్గిన దుర్గమ్మ టికెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

 సగం తగ్గిన దుర్గమ్మ టికెట్లు

September 4, 2017

జయవాడ కనకదుర్గమ్మ గుడిలో అంతరాలయం టిక్కెట్ల ధర సగం తగ్గింది.  రూ. 300 టికెట్ ను రూ. 150కి, రూ. 100 టికెట్ ను రూ. 50కి తగ్గిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సవరించిన ధరలు అమలులోకి వస్తాయని ఆలయ ఛైర్మన్‌ గౌరంగబాబు వెల్లడించారు. మండలి సమావేశంలో ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆలయంలో దసరా నవరాత్రుల నిర్వహణ, కొత్త పూజలపై చర్చించారు.

నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులను దేశించారు.  ఆ ఘాట్‌ రోడ్డు ద్వారానే భక్తులను అనుతించాలన నిర్ణయించారు. గుడిలో టికెట్ల ధరలు భారీగా ఉన్నాయన భక్తుల నుంచి విమర్శలు రావడంతో పాలకమండలి తాజా నిర్ణయం తీసుకుంది.