కొందరికి అప్పడప్పుడు దేవళ్లు కలలో కనిపిస్తారని చెబుతారు. అలా కనిపించడం నిజమో కాదో తెలియదు. కానీ అలాంటి సంఘటనే ఓ మహిళకు ఎదురైంది. తన కలలో దుర్గామాత పొలంలో కనిపించింది. తనకు వచ్చిన కల నిజమా, కాదా అని తెలిసుకునేందుకు వెళ్లి చూడగా, ఆమెకు వచ్చిన కల నిజమైంది.వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జాన్జాద్ తండాకు చెందిన ఏనుగుల ఉపేంద్రమ్మ అనే మహిళకు కలలో ప్రతిరోజు దుర్గామాత కనిపిస్తోందని చెప్పేది. బానోతు వెంకన్న అనే రైతు పొలంలో ఉన్నట్టు కనిపించేదని చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె, ఈ విషయాన్ని వెంకన్నకు చెప్పింది. కానీ అతను అంతగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ పట్టుబట్టగా, చివరికి వెంకన్న గ్రామస్థుల సమక్షంలో తవ్వకాలు జరపగా, దుర్గామాత విగ్రహం బయటపడింది. దీంతో తమను దుర్గామాత కాపాడటానికే వెలిసిందని ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు, ఏర్పాటు చేసి, పురావస్తు అధికారులకు సమాచారం అందించారు. కొందరు గతంలో ఈ ప్రాంతంలో శివాలయం ఉండేదని చెబుతున్నారు.