భారత ఉపముఖ్యమంత్రి అంటూ తప్పులో కాలేసిన దుష్యంత్..! - MicTv.in - Telugu News
mictv telugu

భారత ఉపముఖ్యమంత్రి అంటూ తప్పులో కాలేసిన దుష్యంత్..!

October 29, 2019

హరియాణాలో హంగ్ అసెంబ్లీ తర్వాత ఒక్కసారిగా అక్కడి రాజకీయాల్లో దుష్యంత్ చౌతాల సంచలనంగా మారారు. జననాయక్ జనతా పార్టీని (జేజేపీ) స్థాపించిన కొద్ది నెలల్లోనే ఆయన అక్కడ కింగ్ మేకర్‌గా మారారు. ఆయన మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి రావడంతో చివరకు బీజేపీ అతన్ని దగ్గరకు తీసుకుంది. దీంతో బీజేపీ – జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో సోమవారం సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాల ప్రమాణస్వీకారం చేశారు. 

రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురుప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ ప్రమాణస్వీకారం చేస్తుండగా చిన్న తప్పిదం జరిగింది. ఆయన హరియాణా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అనడానికి బదులు, ‘భారత్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి’ అని తప్పుగా పలికారు. దీన్ని గుర్తించిన గవర్నర్ వెంటనే సవరణ చేశారు. మరోసారి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు చాలా మంది ఇలా ప్రమాణస్వీకారం సమయంలో తడబాటు సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఖాతాలోకి దుష్యంత్ కూడా చేరిపోయారు.