హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ తల్లి కాదు, అతడే.. - MicTv.in - Telugu News
mictv telugu

హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ తల్లి కాదు, అతడే..

October 26, 2019

Dushyanth Is Haryana Deputy Cm

హరియాణా ఉప ముఖ్యమంత్రి ఎవరనే ఊహాగానాలకు తెరపడింది. డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా ఉండబోతున్నారని అని మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చౌతాల తల్లి  నైనా చౌతాలా పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే అవన్నీ ఊహాగానాలేనని తేల్చారు. బీజేపీ – జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగడంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెండు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో గవర్నర్‌ను కలిసి తమ లేఖలను అందజేశారు. ఖట్టర్, చౌతాలా వేర్వేరుగా వెళ్లి గవర్నర్ సత్యదేవ్ నరైన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్‌భవన్‌లో మనోమర్ లాల్ ఖట్టర్ సీఎంగా,దుష్యంత్ చౌతాలా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు మంత్రుల పేర్లను కూడా ఖరారుచేయనున్నట్టు వెల్లడించారు. మొత్తానికి హరియాణా రాజకీయ ఎత్తులకు శుభం కార్డు పడటంతో రేపు కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది.