దసరా అనగానే కళ్లముందు మైసూర్ కదులుతుంది. విద్యుద్దీపాలతో ధగధగ మెరిసిపోయే రాజప్రాసాదం కనిపిస్తుంది. మైసూర్ రాచకుంటుంబీకుల ఆధ్వరంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఏనుగుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. దశమి వేడుకలు ఈ ఏడు కూడా అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే చివరి అంకంలో రాజభవనంలో వేడుకలను రద్దు చేశారు.
రాజమాత ప్రమోద దేవి తల్లి 98 ఏళ్ల పుట్టచిన్నమ్మణ్ణి శుక్రవారం వయోభారంతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ లోకం విడిచి వెళ్లారని రాజభవనంలో ఓ ప్రకటనలో తెలిసింది. దీంతో సంతాప సూచకంగా మైసూర్ ప్యాలెస్లో నిర్వహించే దసరా సంబరాలను రద్దు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏనుగుల ఊరేగింపు మాత్రం ఎప్పట్లాగే జరగనుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రోజు మధ్యాహ్నం దీన్ని ప్రారంభిస్తారు.