దసరా చరిత్ర.. ఆ పేరు ఎలా వచ్చింది.?  - MicTv.in - Telugu News
mictv telugu

దసరా చరిత్ర.. ఆ పేరు ఎలా వచ్చింది.? 

October 23, 2020

హిందువుల అత్యంత విశిష్టమైన పండగల్లో ఒకటి విజయ దసమి. దీన్నే దసరా అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని నవమి వరకు వేడుకలు జరుగుతాయి. చివరి రోజున దశమి కాబట్టి విజయ దశమి పేరుతో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా దుర్గా దేవి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తూ ఉంటారు. భారత దేశం అంతా వివిధ రకాల పద్దతుల్లో ఈ వేడుకలు జరుగుతాయి. పండగ ఎలా జరిగినా దాని పరమార్థం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇంతకీ దసరా పండగ చరిత్ర ఏమిటి..? దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనడానికి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పేరు ఎలా వచ్చిందంటే :  

దశమి కలిపి దసరా అని పిలుస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. సంస్కృతం నుంచి ‘దశ హర’ అనే పదం వచ్చింది. పది రోజుల పండుగ అనే అర్ధంతో వాడుకలో ఉంది. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా విజయ దశమిగా కూడా అభివర్ణిస్తారు. దీనికి కొన్ని చారిత్రక కారణాలు ఉన్నాయి. రామాణం, మహా భారతంలో కూడా ఈ పండగకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.  

Dussehra Historical Story

చరిత్ర ఇదే : 

బ్రహ్మ దేవుడి వరాల వల్ల గర్వంతో ప్రజలను మహిషాసురుడు అనే రాక్షుడు ప్రజలను వేధిస్తూ ఉంటారు. దీంతో ఆగ్రహించిన జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేస్తుంది. భీకర పోరు తర్వాత అతన్నివధిస్తుంది. దీంతో 10వ రోజున ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. ఈ విజయానికి గుర్తుగా విజయ దశమి అనే పేరు వచ్చింది. అందుకే దుర్గా దేవి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అలంకరించి చివరి రోజున ఘనంగా పండగ చేసుకుంటున్నారు. దేవీ పూజ ఉత్తర, ఈశాన్య భారత ప్రజలు పెద్ద ఎత్తున చేస్తుంటారు. 

దసరా పండగకు మరో విశిష్టత కూడా ఉంది. రాముడు యుద్ధం చేసి రావణుడిపై గెలుస్తాడు. లంకా దహనం చేసి రావడంతో దీన్ని విజయానికి ప్రతీకగా పేర్కొన్నారు. అప్పటి నుంచి అన్యాయంపై న్యాయం గెలిచిందని ఈ పండగ జరుపుతున్నారు. అంతే కాకుండా శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారనే ప్రచారం ఉంది. అందుకే దసరా సందర్భంగా జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు.   

మహా భారతంలోనూ దసరా ప్రస్తావన ఉంది.  పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను భద్రపరిచి వెళ్తారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు చేసి వెళ్తారు. తిరిగి తీసుకున్న రోజు దసరా కావడం విశేషం. అందుకే శమీ పూజలు నిర్వహిస్తారని పేర్కొంటారు. దసరా, విజయదశమిలో దేశవ్యాప్తంగా వేర్వేరు ఆచారాల్ని పాటిస్తున్నా.. అన్నింటి సందేశమూ ఒక్కటే. చెడుపై మంచి విజయం. చెడు ఎప్పటికీ గెలవదని చాటి చెప్పింది. 

Dussehra Historical Story

రైతుల పండగ : 

దసరా పండగ రైతుల్లో కొత్త సంతోషాన్ని నింపుతుంది. అప్పటి వరకు పనుల్లో మునిగిపోయిన రైతులకు ఓ రకంగా ఇది విశ్రాంతి సమయం లాంటిది. పంట ఎదిగి, కోతకు వచ్చేలోపున లభించే కొద్దిపాటి తీరికలో జనం దసరావేడుకలు చేసుకొంటారు. రుతువుల మార్పుకు దసరా చిహ్నంగా నిలుస్తుంది.  వర్షాల తర్వాత అప్పుడే శీతాకాలం ప్రవేశిస్తుంది. ఖరీఫ్ పంట కూడా చేతికి వచ్చే సమయంతో రైతులు అంతా సంతోషంగా ఈ పండగ జరుపుకుంటారు. 

అంతే కాకుండా అశోక చక్రవర్తి బుద్ధిడి మారింది కూడా ఇదే రోజనని చెబుతారు. బౌద్దులకు కూడా ఇది విశిష్టమైన రోజు. రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్. అంబేదర్కర్ కూడా భౌద్ధ మతంలోకి మారింది కూడా ఇదే రోజు కావడం విశేషం. 

Dussehra Historical Story