దసరాకు ముస్తాబవుతున్నబడా హీరోలు..! - MicTv.in - Telugu News
mictv telugu

దసరాకు ముస్తాబవుతున్నబడా హీరోలు..!

June 28, 2017

దసరా పండగ సెల్వులెప్పుడస్తయని  పోరగాండ్లు ఎద్రుజూశినట్టు ఈ యేడాది దస్రాకోసం ముగ్గురు పెద్ద హీరోలు మస్తు ఎద్రు జూస్తున్రట.హీరోలే గాదు ఆళ్ల అభిమానులు గుడ కండ్లల్ల ఒత్తులు ఏస్కొని మరీ ఎద్రుసూస్తున్రట.దస్రనాడు పాలపిట్టను జూశి అందర్కి జమ్మిఆకు బంగారం వెట్టి అలయ్ బలయ్ తీస్కొని సక్కగ హీరోలను జూశెనీకి టాకీస్ల తొవ్వ వట్టెనీకి తయ్యారైతున్నరట ఫ్యాన్సు.

ఆ ‍హీరోలు ఎవరు,ఆ సిన్మలేంటియ్?

ముందుగాళ్ల జెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించి ,ఆయన నటిస్తున్న జై లవకుశను ఎట్లనన్న సెప్టెంబర్ 21 నాడు టాకీస్లలల్లకు పట్కచ్చెతందుకు డైరెక్టర్ బాబీ & చిత్ర యూనిట్ మస్తు కష్టపడ్తున్రట.ఇగ సాలె పురుగు అదే.. మహేశ్ బాబు నటిస్తున్న స్పైడర్ సిన్మను సెప్టెంబర్ 22 న రిలీజ్ జేసేందుకు డైరెక్టర్ మురుగదాస్ గుడ రికాంలేకుంట శెమ్టలు దారవోస్తున్రట.ఇగ ఆ మూడో హీరో ఎవలంటే ఇంకెవలు నందమూరి నట సింహం బాలయ్య బాబు. బాలయ్య బాబుతోని పూరీజగన్నాథ్ అనే డైరెక్టర్ పైసా వసూల్ అనే సిన్మ దీస్తున్నడు గదా,సిన్మ శాల్ గాకముందే శెప్పిరి ఎట్లనన్న సిన్మను దస్రాకు విడుదల జేశి  మస్తు పైసల్ వసూల్ జేస్తమని.గిట్ల ముగ్గురు బడా హీరోలు ఈ దస్రాకు పోటీవడ్తున్రన్నట్టు, ఇగ ప్యాన్స్ కైతె పండగే పండగ పోన్రి.కనీ ఈడ ఒక్కటి శెప్పుకోవాలే అదేంటంటే మొన్ననే టాకీసోళ్లు మేం లాసైతున్నం అని లబ లబ మొత్తుకుంటే సర్కారోళ్లు టికెట్ ధరలను ఏక్థంన వెంచిన్రు గదా.కాబట్టి ప్రేక్షక మహాదేవుళ్లకు ఈడికెళ్లి వినోదం జరంత పిరమైందన్నట్టు.