ధోనీపై పాట రూపొందించిన బ్రావో - MicTv.in - Telugu News
mictv telugu

ధోనీపై పాట రూపొందించిన బ్రావో

June 29, 2020

Bravo

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ జులై 7న 39వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో.. ధోనిపై ఓ పాటను రూపొందించాడు. ఈ పాటకు ‘హెలికాప్టర్‌’ అని పేరు పెట్టాడు. ధోనికి పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను అంకితమివ్వనున్నాడు. బ్రావో అద్భుతమైన గాయకుడు. మంచి డాన్సర్‌. తానే స్వయంగా పాటలు రాసి వీడియోలు చేస్తాడు. ప్రస్తుతం ‘హెలికాప్టర్‌’ పాట టీజర్‌ను విడుదల చేశాడు. బ్రావో.. ధోని మంచి స్నేహితులు. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున వీరిద్దరు ఆడుతున్నారు.

‘జులై 7కు మీరంతా సిద్ధమేనా!! ఆ రోజు మహీ పుట్టినరోజు. మేమంతా అతడి జన్మదిన వేడుకలను ఛాంపియన్‌ టీమ్‌ రూపొందించిన ప్రత్యేకమైన పాటతో జరుపుకోబోతున్నాం. గాయ్స్‌.. మమ్మల్ని ట్యాగ్‌ చేయడం మర్చిపోవద్దు. మీ అందరి హెలికాప్టర్‌ డాన్స్‌ చూడనివ్వండి.’ అని ఈ పాట టీజర్ ను ఇంస్టాగ్రామ్ లో విడుదల చేస్తూ బ్రావో క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.