ప్రేమంటే ఇదే.. త్వరలో చనిపోతాడని తెలిసీ పెళ్లాడింది..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమంటే ఇదే.. త్వరలో చనిపోతాడని తెలిసీ పెళ్లాడింది.. 

October 12, 2019

Dying man marries love of his life in wedding ceremony with every detail donated

‘చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచొస్తాను! మరుజన్మకైనా కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను..!’ అని కుర్రాళ్లు, కుర్రమ్మాయిలు కవితలు వల్లిస్తే ప్రేమ పిచ్చి అలాగే ఉంటుందిలే అని పెద్దలు కొట్టిపారేస్తుంటారు. పెద్దాళ్ల సంగతి, స్వార్థప్రేమల సంగతి పక్కనబెడదాం. స్వచ్ఛమైన ప్రేమ గురించి చెప్పుకుందాం. నిస్సార్థ ప్రేమ మరణాన్ని సైతం ధిక్కరిస్తుంది. ప్రేమించిన మనిషి కోసం ఎంత కష్టాన్నయినా ఓర్చుకుంటుంది. చిర్నవ్వుతో ప్రేమను పూయిస్తుంది. 

r

బ్రిటన్‌లోని ఫిలేగ్ ప్రాంతానికి చెందిన మేల్స్ హారిసన్, లిజ్ టీనేజ్ నుంచే ప్రేమించుకుంటున్నారు. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని బాసలు చేసుకున్నారు. విధికి వారి ప్రేమను చూసి కట్టుకుట్టిందేమో అన్నట్లు  హారిసన్‌కు 18 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. తొలుత అంతగా పట్టించుకోలేదు. దీంతో అది ముదిరిపోయింది. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది. అతడు అతి త్వరలోనే చనిపోతాడని వైద్యులు చెప్పారు. లిజ్ గుండెలు పగిలిపోయాడు. అయినా తేరుకుంది.  హారిసన్‌ను పెళ్లాడాలని, అతని చరమాంకంలో సంతోషం నింపాలని నిర్ణయించుకుంది. బంధుమిత్రులు ఇదేం నిర్ణయమని తిట్టిపోశారు. అయినా లిజ్ వెనక్కి తగ్గలేదు. విషయం అతనికి చెప్పింది. హారిసన్ నివ్వెరపోయాడు, వద్దన్నాడు. లిజ్ అతనికి నచ్చజెప్పింది. నిశ్చితార్థం జరిగింది. కుర్చీలో కూర్చునే అతడు ఉంగరం అందించి ప్రపోజ్ చేశాడు. లిజ్ నిష్కల్మశ హృదయంతో దాన్ని అందుకుంది. 

పెళ్లికి డబ్బులు కావాల్సి వచ్చాయి. అప్పటికే వైద్యం కోసం బాగా ఖర్చు చేసిన హారిసన్ కుటుంబం నిస్సహాయత వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న బంధుమిత్రలులు, కొన్ని సంస్థలు ముందుకొచ్చారు. విరాళాలు సేకరించి వారిని పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశాయి. ఏ లోటూ లేకుండా పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హారిసన్ పూర్తిగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. 

 

https://www.youtube.com/watch?v=hLGo4Z3xEc0