ఎక్కడైనా ఒకరిద్దరి పుట్టిన రోజులు మ్యాచ్ అవుతాయి. లేదా పది మందివో, ఇరవై మందివో ఒకే రోజు ఉంటాయి. కానీ ఆ గ్రామంలో పదివేలమంది పుట్టిన రోజు జనవరిన 1నే.. ఆశ్చర్యమేసినా ఈ ఫ్రూప్ ని చూస్తే నమ్మితీరాల్సింది. ఇదేలా అనుకుంటున్నారా…
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ సమీపంలోని కంజాసాలో దాదాపు పదివేల మంది జనాభా ఉంటోంది. ఈ ఊరి అందరి డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఒకటే. తండ్రులు, తల్లులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, పిల్లలు ఒకే తేదీన పుట్టారంట. అలా అని చెప్పి ఆధార్‌కార్డులో నమోదు చేయించుకున్నారు.
ఆధార్ కార్డు పొందేందుకు ఎక్కువ కాలం ఎదురు చూడలేక పుట్టిన తేదీని జనవరి 1గా నమోదు చేయించుకున్నారట. ఇవేవి పట్టించుకోని అధికారులు వారికి ఆధార్‌కార్డులు ఇచ్చేశారు. యూపీలోని ప్రతీ పాఠశాలలో చదివే విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలంటూ టీచర్లను యోగి సర్కార్ ఆదేశించింది. దీంతో విద్యార్థుల ఆధార్‌కార్డులు పరిశీలించగా అందరి పుట్టిన తేదీ జనవరి 1గా ఉండటం చూసి టీచర్లు అవాక్కయ్యారు. అధికారులను బురిడీ కొట్టించిన గ్రామస్తులపై పోలీసులకు కంప్లయింట్ చేశారు.