తెలంగాణ ఎంసెట్ తేదీలపై మంత్రి ప్రకటన.. సెప్టెంబర్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఎంసెట్ తేదీలపై మంత్రి ప్రకటన.. సెప్టెంబర్‌లో

August 10, 2020

Eamcet exam dates in telangana.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెల్సిందే. అకడమిక్ ఇయర్ మొదలైనా ఇంకా పోటీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నేలగొంది. విద్యార్థుల్లో నేలగొన్న ఆందోళనను దూరం చేయడానికి తెలంగాణ ఉన్నత విద్య శాఖ కసరత్తులు చేస్తోంది. 

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 9, 10, 11, 14వ తేదీ మధ్యలో ఎంసెట్ పోటీ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే ఆగస్టు 31న ఈసెట్, సెప్టెంబరు 2న పాలిసెట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాలేజీల రీఓపెన్ గురించి ఆమె మాట్లాడుతూ… సెప్టెంబరు 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్లు చేపడతాం. ఆగస్టు 17 నుంచి సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ‘హైకోర్టు నుంచి అనుమతి వస్తే ఎంట్రెన్సు పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.