ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ల విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ల విడుదల

March 28, 2022

vnvn

లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఎంసెట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ. 800, ఎస్సీ, ఎస్టీలకు రూ. 400 లుగా ఉంది. జులై 14, 15 తేదీలలో ఎంసెట్ అగ్రికల్చర్, 18, 19, 20 తేదీలల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ రెండో ఏడాదిలో చేరేందుకు నిర్వహించే ఈ సెట్‌ను జులై 13న నిర్వహించనున్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు స్వీకరిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ఆచార్య లింబాద్రిలు ప్రకటించారు. కాగా, ఎంసెట్‌కు రెండున్నర లక్షల మంది, ఈ సెట్‌కు పాతిక వేల మంది పోటీపడతారని ఓ అంచనా.