Early elections Chance In Telanaga..?
mictv telugu

మునుగోడు ఊపుతో ముందస్తుకు వెళ్తారా?

November 6, 2022

Early elections Chance In Telanaga..?

మునుగోడు ఊపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా?అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేయబోతున్నారా? బీజేపీ, కాంగ్రెస్‌లకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా అడుగులు వేయబోతున్నారా? కాంగ్రెస్‌ని సీన్‌లో లేకుండా చేసి బీజేపీని ఈజీగా ఢీ కొట్టబోతున్నారా. కేసీఆర్ ఖతర్నాక్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది. ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.

ముందస్తుకు దారి ఇదేనా?

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ఉంది. షెడ్యూల్ ప్రకారం 2023 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. జనరల్ ఎలక్షన్స్‌కు ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుందని జోరుగా ప్రచారం గతంలో సాగింది. లేదు లేదు అంటూ కేసీఆర్ తేల్చిచెప్పారు. ముందస్తుకు వెళ్లాల్సిన అసవరం లేదని క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో పరిస్థితులు వేరు..ఇప్పుడు పరిస్థితులు వేరు. కారు టాప్ గేర్‌లో ఉంది. గులాబీ గాలి వీస్తోంది. ఎన్నికలకు ఎలాగూ 12 నెలల సమయమే ఉంది. ఈ లోపు ముందస్తు ఎన్నికలకు వెళితే కలిసి వస్తుందని కొందరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారట.

మళ్లీ అదే అస్త్రం

మునుగోడు యుద్ధం ముగిసింది. గులాబీ గుభాళించింది. కారు స్పీడ్‌తో కమలం వాడిపోయింది. మునుగోడు విక్టరీ కిక్కుతో టీఆర్ఎస్ శ్రోణుల్లో జోష్ పెరిగింది. ఇదే ఊపుతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారేమోనని ఊహాగానాలు మొదలయ్యాయి. ముందస్తు ఎన్నికలంటే కేసీఆర్ మహాఇష్టం. సమయం చూసి ప్రత్యర్థుల్ని ముందుస్తు అస్త్రంతో దెబ్బకొడతారు. వారు ఎన్నికలకు ప్రిపేర్ అయ్యేలోపే కారు క్యాంపెయిన్ టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. గత ఎన్నికల్లో సరిగ్గా ఇదే జరిగింది. 2018లో ఆర్నెళ్ల ముందే అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ప్రజాతీర్పు కోరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విక్టరీ కొట్టింది. వన్ బై థర్డ్ మెజారిటీ సీట్లు పొందారు. మళ్లీ ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగిస్తారని అందరూ అనుకుంటున్నారు. ముందస్తుకు వెళ్లే అవకాశం పక్కా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జమిలీకి నై

జమిలీ ఎన్నికలకు ఈసీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తుంది. 2024 ఎన్నికల్లో వర్కౌట్ చేయాలని చూస్తుంది. కానీ జమిలీ ఎన్నికలు అంటే చాలా రాష్ట్రప్రభుత్వాలు,పార్టీలకు ఇష్టం లేదు. జమిలీ కాకపోయినా 2024లో సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ కేంద్రానికి కేసీఆర్ అస్సలు ఇవ్వరు. ఎందుకంటే ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకేసారి జరిగితే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్‌కే నష్టం..బీఆర్ఎస్‌గా మారినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అందుకే కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం పక్కా ఖాయంగా కనిపిస్తోంది.

ముందస్తుకే మొగ్గు

టీఆర్ఎస్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. టీఆర్ఎస్ త్వరలో అధికారికంగా బీఆర్ఎస్‌గా మారబోతోంది. బీఆర్ఎస్ పేరిట దేశ రాజకీయాల్లోకి వెళ్లబోతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.నరేంద్ర మోదీని ఇప్పటికప్పుడు ఢీ కొట్టాలంటే విపక్షాల వల్లే కాదు..కేసీఆర్ వల్ల ఏం అవుతోంది. ఇది కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే ఓవైపు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ముందస్తుకు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫామ్ హౌస్ ఫైల్స్‌తో కేంద్రాన్ని ఇరుకున పెడుతూ ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్‌ని అధికారంలోకి తెచ్చి..ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి కంప్లీట్‌గా వెళ్లే అవకాశం ఉంది.

ఆర్నెళ్లలోనే

ఆరు నెలల్లో ముందస్తుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఈలోపు పెండింగ్ పనుల్ని చకచకా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న గులాబీ గాలిని అలాగే మొయింటైన్ చేసే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి లక్ష్యాల్ని పూర్తి చేస్తే మార్చిలో అసెంబ్లీని రద్దు చేయొచ్చు. మార్చిలో అసెంబ్లీ రద్దు అయితే..ఆర్నెళ్లలోపు ఎన్నికలు జరగాలి. అంటే ఆగస్టులోపే అసెంబ్లీ ఎన్నికలుంటాయి. కొంచెం అటుఇటైతే నవంబర్‌లోపే ఎలక్షన్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే. చూడాలి ముందస్తుకు వెళ్తారా?షెడ్యూల్ ప్రకారమే వెళ్తారో.