అఫ్ఘానిస్తాన్ భూకంపంతో అల్లాడిపోయింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భారీ భూకంపంలో 250 మందికిపై మృత్యువాత పడగా వందల మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పలు ప్రాంతాల్లో భవనాలు నేటమట్టమయ్యాయి. వందల మంది ఇళ్ల శిథిలాల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. రాత్రిపూట భూమి కంపించండంతో చాలామంది తప్పించుకునే మార్గం లేక శిథిలాల కిందే సమాధి అయ్యారు.
భారత సరిహద్దులోని ఆగ్నేయ ప్రాంతంలో ఖోస్త్కు 44 కిలోమీట్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం నమోదైంది. భూకంప ప్రభావం భారత్, పాకిస్తాన్లలోనూ కనిపించింది. అఫ్ఘాన్ రాజధాని కాబూల్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా 500 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు నమోదైనట్లు యురోపియన్ మెడిటేరియన్ సెస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప తీవత్ర రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది.