Earth rising video from the moon
mictv telugu

చంద్రుడిపై ఉదయిస్తున్న పుడమి.. వీడియో చూడాల్సిందే

November 21, 2022

సూర్యోదయం, సూర్యాస్తమయాలను భూమిపై ఉన్న మనం రోజూ వీక్షిస్తుంటాం. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది కాబట్టి మనకు అవి కనిపిస్తాయి. భూమికి చందమామ ఉపగ్రహం. పుడమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. మనకు సూర్యోదయం అయినట్టే, చంద్రుడిపై నుంచి చూసినప్పుడు భూమి ఉదయించడం, అస్తమించడం జరుగుతుంది. కానీ ఇన్ని రోజులుగా అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. తాజాగా జపాన్‌కు చెందిన లూనార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ కగుయా ఆ అద్భుత దృశ్యాలను అత్యాధునిక కెమెరాలో బంధించింది.

 

నీలి రంగులో ఉన్న భూమి గుండ్రంగా ముద్దుగా ఉందని నెటిజన్లు వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంత విశ్వంలో చిన్న బంతిలా ఉన్న భూమిపై ఉన్న మానవుల చావు పుట్టుకలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భూగొడవలు తద్వారా జరిగే హత్యలు, చదువు, నిరుద్యోగం, సంపాదన, గర్వం వంటివి చాలా చిన్నవని కామెంట్లు చేస్తున్నారు.