పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలో భూప్రకంపనలు - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలో భూప్రకంపనలు

September 24, 2019

పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రల్లో భూమి కంపించింది. దీని ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా కనిపించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

లాహోర్‌కు వాయువ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. కశ్మీర్‌ సహా ఉత్తర భారతదేశంలో కొంతమేర భూప్రకంపనల ప్రభావం చూపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇంట్లో నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబందించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.