Earthquake in Delhi..People run in fear
mictv telugu

ఇలా ఉంటే స్నేహితులు మీ వెంటే…

January 24, 2023

effective ways to build stronger friendship

కరోనా తర్వాత లైఫ్ మొత్తం మారిపోయింది. అసలే మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది అనుకుంటుంటే కోవిడ్ వలన అది మరింతగా పెరిగిపోయింది. పర్సనల్‌గా వెళ్ళి కలవడం కంటే, వీడియో కాల్స్, టెక్ట్స్ మెసేజెస్‌తో మాట్లాడేసుకుంటూ గడిపేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్ దూరమయ్యాయి. కొన్ని కొత్త స్నేహాలు వచ్చాయి. జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్‌తో ఫ్రెండ్షిప్‌ని కొనసాగించడం కాస్తా కష్టం. రోజువారీ పనులు, కుటుంబ సభ్యులకి కేర్ తీసుకోవడం, పని మొదలైన విషయాలతో స్నేహాలు ప్రభావితమవుతాయి. బంబుల్ రిలేషన్‌షిప్ నిపుణుడు, షాజీన్ శివదాసాని కోల్పోయిన ఫ్రెండ్షిష్‌ని ఎలా కలపాలో టిప్స్‌ని అందించారు.

మీరు ఎవరినైనా కలవాలనుకుంటే ప్రయత్నం చేయడం అతి ముఖ్యమైనది. మీరు వారి గురించి అడగడం,సమస్యలను తెలుసుకోవడం, బాధ్యతగా ఉండడం, ప్రాముఖ్యతని ఇవ్వడం చాలా ముఖ్యం. అదే విధంగా ఏదైనా సందర్బంలో వారికి అవసరమైనప్పుడు అందుబాటులో లేకపోతే ఆ విషయాన్ని వారికి తెలియజేయండి. తర్వాతైనా మీ ఫ్రెండ్స్ ని కలిసి మాట్లాడేందుకు, వారికి సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ విషయంలో ఆలోచించేందుకు కాస్తా టైమ్ ఇవ్వండి. కచ్చితంగా మీతో ఉండాలని ఆశించవద్దు. ఇష్టమైతే మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారు. అప్పటివరకూ వెయిట్ చేయండి.

మీరు, మీ ఫ్రెండ్ వర్చువల్‌గా కలిసి టచ్‌లో ఉండేందుకు ప్లాన్ చేయండి. ఇందుకోసం మీ గ్యాంగ్స్‌ అందరినీ కూడా పిలుచుకోవచ్చు. అదే విధంగా మీ క్లోజ్ ఫ్రెండ్‌తో పర్సనల్‌గా మాట్లాడితే మీ ఇద్దరి బంధం మరింత పెరుగుతుంది. మీరు మీ విడిపోయిన స్నేహాన్ని కలుపుకోవాలనుకున్నప్పుడు మొదట విడిపోవడానికి గల కారణాలను గుర్తుంచుకోండి. మీ స్నేహితులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు నిజాయితీగా ఉండాలి. స్నేహాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నప్పుడు మీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయితే బాధపడొద్దు. విడిపోయిన ఫ్రెండ్‌పై ఒత్తిడి తీసుకురావొద్దు. మీరు చేయాల్సిందల్లా మళ్ళీ కనెక్ట్ కావాలనే కోరికను వారికి తెలియజేయడమే. తిరిగి మీ ఫ్రెండ్షిప్ ప్రారంభమయ్యేందుకు సమయం పడుతుంది.

ఇవన్నీ కాదు కొత్తగా ఫ్రెండ్స్‌ని ఏర్పరుచుకోవాలంటే కొత్త స్నేహితులు కావాలనుకుంటే మీరే కలిసిపోవాలి. అందరినీ కలుస్తూ ఉండాలి. మానవ అనుభవంలో సామాజిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయి. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన సంబంధాలు కీలకం.భారతదేశంలోని చాలా మంది వ్యక్తులు ఇప్పుడు వర్చువల్‌గా స్నేహితులని వెతకడానికి ముందుకొస్తున్నారు. చివరిగా బంధాలు చాలా ముఖ్యమైనవి, విలువైనవి…వీటిని కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే స్నేహాలు జీవితంలో గొప్ప వరం. వీటిని ఆస్వాదించాలి.మనకి ఏ కష్టమొచ్చినా, ఎంత బాధలో ఉన్నా మంచి ఫ్రెండ్ ఉంటే చాలు వాటన్నింటికి ఎదురీదొచ్చు. అందుకే చిరకాల మిత్రులు ఉండాల్సిందే.