గ్రీస్, టర్కీ విలవిల.. 22 మంది బలి, వేలమందికి గాయాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

గ్రీస్, టర్కీ విలవిల.. 22 మంది బలి, వేలమందికి గాయాలు.. 

October 30, 2020

Earthquake in Greece and Turkey

గ్రీస్, టర్కీ దేశాల తీరాలు వణికిపోయాయి. శక్తిమంతమైన భూకంపంతో వందలాది భవనాలు కుప్పకూలాయి. వేలాదిమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. 22 మంది చనిపోగా, వేలమంది గాయపడ్డారు.  గ్రీస్‌లోని సమోస్‌, టర్కీ ఏజియన్ తీరాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. దీని కేంద్రాన్ని టర్కీ తీరంలోని ఇజ్మర్ ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కి.మీ. దిగువన గుర్తించారు. టర్కీలోని  ఇస్తాంబుల్ లోనూ భూమి కంపించింది. అయితే ఎలాంటి నష్టమూ జరగలేదని తెలుస్తోంది. 

ఇజ్మీర్‌, ఇస్తాంబుల్‌, ఏథెన్స్‌ తదితర నగరాల్లో జనం భయంతో రోడ్లపైకి పరిగెత్తారు. కొన్ని చోట్లు కాలువలు తెగిన నీరు వీధుల్లోకి వచ్చింది. సునామీ వస్తుందనే అనుమానంతో వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ‘నేను చాలా భూకంపాలు చూశాను. కానీ ఇంతసేపు వచ్చిన భూకంపాన్ని చూడ్డం ఇదే తొలిసారి’ అని ఎథెన్స్ పౌరుడొకరు చెప్పారు. ఇజ్మీర్ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తుంటాయి. 1999నాటి విలయంలో 17 వేల మంది బలయ్యారు.