హైదరాబాద్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు!

October 3, 2020

mhbm

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు భయాందోళనను సృష్టించాయి. భారీ ఎత్తున శబ్ధం వస్తుండటం చూసి జనం పరుగులు తీశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి అర్ధరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. జూబ్లీహిల్స్, రహమత్‌నగర్, బోరబండ, అల్లాపూర్ ప్రాంతాల్లో ఇది చోటు చేసుకుంది. దాదాపు 12 సార్లు భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు వెల్లడించారు. ఈ సంఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని వెనక కారణాలపై అధికారులు అన్వేషిస్తున్నారు. 

రాత్రి 8.15 గంటల సమయంలో శబ్ధం వచ్చింది. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత 9 గంటలకు కూడా ఇలాగే జరగడంతో బయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇలా 12 సార్లు ఒక్కోసారి 5 నుంచి 10 సెకన్లపాటు కంపించింది. చివరి సారిగా రాత్రి 11.25 గంటల సమయంలోనూ భారీ శబ్ధం వచ్చింది. ఆ తర్వాత ప్రశాంతంగా ఉండటంతో అంతా ఇళ్లలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు, రెస్య్కూ టీంతో చేరుకున్నారు.  2017లోనూ ఓసారి ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నారు.