హైదరాబాద్ వాసులను భూ ప్రకంపనల భయం వీడటం లేదు. కొన్ని రోజులుగా వరసగా భారీ శబ్ధాలు వస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఇటీవల బోరబండ, జూబ్లీహిల్స్, రహమత్నగర్ ప్రాంతాల్లో పెద్ద శబ్దంతో రెండుసార్లు ఈ ప్రకంపనలు సంభవించగా, తాజాగా గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీ, ప్రాంతాల్లోనూ చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత భారీ శబ్ధాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
భూకంపం సంభవిస్తోందనే ప్రచారం జరగడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అందరూ రాత్రి అంతా రోడ్లపైనే గడిపారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు. వరుసగా భూమి నుంచి శబ్దాలు ఎందుకు వస్తున్నాయో ఇంకా అంతు చిక్కలేదు. వీటిపై నిపుణులను సంప్రదించి తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా అక్కడ రెస్యూటీంను అందుబాటులో ఉంచారు. వరుసగా భారీ వర్షాలు, భూ ప్రకంపనలు, శబ్ధాల నేపథ్యంలో భాగ్యనగర వాసులకు కంటిమీద కనుకు ఉండటం లేదు.