నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగకు సర్వం సిద్ధమైంది. భారత్ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు భారీగా సభాస్థలికి చేరుకోవడంతో సందడి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ సభతో నాందేడ్ పట్టణంతోపాటు సభ స్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్లమేర గులాబీ మయమయ్యాయి. భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సభకు ఇప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.
బహిరంగ సభకు 60 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి.హింగోలి జిల్లాలో నాందాపూర్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 3.1 గా నమోదైంది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో భూకంపం సంభవించగా.. దాని ప్రకంపనల ప్రభావం సుమారు 25 నిమిషాల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ భూకంప ప్రభావం జామాబాద్ జిల్లాలో కూడి కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రభావం పెద్దగా లేకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.