లద్దాఖ్, కార్గిల్ లో భూకంపం! - MicTv.in - Telugu News
mictv telugu

లద్దాఖ్, కార్గిల్ లో భూకంపం!

July 5, 2020

bncnb

లద్దాఖ్ లో భారత్-చైనా దేశాల భద్రతా దళాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నేలగొన్న సంగతి తెల్సిందే. తాజాగా ఈరోజు తెల్లవారుజామున 3.37 గంటల సమయంలో లడఖ్, కార్గిల్ తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. హిమాలయ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. 

కార్గిల్ కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.7గా నమోదైందని తెలుస్తోంది. ఈ ప్రకంపనలతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ లోని పంజీన్ కు ఉత్తరంగా 683 కిలోమీటర్ల దూరంలో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 252 కిలోమీటర్ల లోతున ఉందని అధికారులు తెలిపారు.