అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం - MicTv.in - Telugu News
mictv telugu

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

July 13, 2020

n c

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా భయంతో వణికిపోతున్న ప్రజలను భూకంపాలు మరింత భయపెడుతున్నాయి. రోజుకి దేశవ్యాప్తంగా ఎదో ఓ చోట భూప్రకంపనలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా ఈరోజు తెల్లవారుజామున 2.36 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. 

డిజ్లీపూర్ కు ఉత్తరాన 153 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. జూన్ 28న కూడా ఇదే ప్రాంతంలో డిజ్లీపూర్ భూకంపం సంభవించి సంగతి తెల్సిందే. వరుస భూప్రకంపనలతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.