భూమి తనచుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తనచుట్టూ తాను తిరగడం మానేయదని ఇదివరకూ శాస్త్రవేత్తలు చెబితే విన్నాం. కానీ హఠాత్తుగా భూమి తిరగడం ఆగిపోతే.. జరిగే అనర్థాలను ఊహించడం చాలా కష్టం. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. దీనివల్లే మనకు రాత్రి, పగలు అనే కాలమానం నడుస్తుంది. కానీ.. ఒక్కసారిగా భూమి తిరగడం ఆపేసిందంటే.. రేయింబవళ్లపై దుష్ర్పభావం పుడుతుంది. కొన్ని దేశాల్లో సూర్యుడు సెగ తగులుతూనే ఉంటుంది. మరో వైపు కొన్ని దేశాలు.. రాత్రి సమయాన్నే గడపాల్సి వస్తుంది. రాత్రి, పగలు మారడానికి తక్కువలో తక్కువగా ఆరు నెలల సమయం పడుతుంది. దీంతో సీజన్ అనేది.. చాలా కఠినంగా మారి.. విశ్వంపై దుష్ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు ఈ ప్రస్తావన రావడానికి ముఖ్య కారణం.. భూమిలోని కోర్ భాగం తిరగటం ఆగిపోయిందట. ఈ విషయాన్ని కూడా శాస్త్రవేత్తలే చెప్పారని ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’ ఓ కథనంలో తెలిపింది. భూ అంతర్భాగంలో ఏం జరుగుతున్నదో తాజాగా తేల్చిన బృందం.. రాబోయే రోజుల్లో రాత్రిపగళ్లలో తేడాలొచ్చే అవకాశమున్నాయని చెప్పారు. భూమి అంతర్భాగంలో మూడు భాగాలుండగా.. అందులో ఒకటి కోర్, రెండోది ఆవరణం, మూడోది భూపటలం. వీటిలో కోర్ భాగం.. దాదాపు 7వేల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండి రుగుతూ ఉండేది. కానీ, 2099 నుంచి తిరగటం ఆగిపోయిందని, బహుశా వ్యతిరేక దిశలో తిరిగేందుకు ఇలా ఆగిపోయిందేమోనని సైంటిస్టులు భావిస్తున్నారు. దీని ప్రభావం కాలమానంపై పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
Earth’s core , New research , Nature Geoscience journal , repeating earthquakes , last six decades , stopped around the year 2009 , slowly restarted in the opposite direction, might now be spinning in the opposite direction,