లవర్ ఇంటికి నిప్పుపెట్టిన ప్రేమోన్మాది..ఇద్దరు సజీవదహనం - MicTv.in - Telugu News
mictv telugu

లవర్ ఇంటికి నిప్పుపెట్టిన ప్రేమోన్మాది..ఇద్దరు సజీవదహనం

January 22, 2020

gcn

ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రేమోన్మాది మాసాల శ్రీనివాస్ ఆమె ఇంటిపై అర్దరాత్రి పెట్రోలుపోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. కానీ, ఆమెకు కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేశారు. దీంతో ఆ యువకుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. 

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువకుడు నేరుగా యువతి ఉంటున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో రాము అనే యువకుడు, విజయలక్ష్మి అనే నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనమయ్యారు. దుర్గా భవాని, మహేష్, ఏసుకుమార్, సత్యవతిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.