రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అంధులు బలి..  - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అంధులు బలి.. 

September 25, 2020

vnmvm n

లోకాన్ని చూడలేని ఇద్దరు అంధులను రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అతనితోపాటు ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ విషాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఆటో.. అదుపు తప్పి తన ముందున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. 

ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఆరేళ్ల వెంకటేశ్, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అంధులు అక్కడికక్కడే చనిపోయారు. అంధులను కాకినాడలోని భానుగుడికి చెందినవారిగా గుర్తించారు. డ్రైవర్ మైనర్ అని తెలుస్తోంది. ప్రమాదం వల్ల రోడ్డుపై కొన్ని గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు.