భయమెందుకు? ఆ మిడతలను తినేస్తే పోలా!
ఒకవైపు కరోనా మహమ్మారితో దేశమంతా అల్లకల్లోలం వుతోంటే.. కొత్తగా మిడతల దండు భయం రైతులను బాగా ఇబ్బంది పెడుతుంది. ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ నుంచి కొన్ని కొట్లలో మిడతల దండు దేశంలోకి ప్రవేశించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలోకి ప్రవేశించింది. మిడతల బారినుంచి తప్పించుకోవడానికి చాలా మంది పురుగుల మందులను పిచికారి చేస్తున్నారు. కొన్ని చోట్ల డప్పులు మోగించడం, పాటలు పెద్ద సౌండ్ తో పెట్టడం, హైడ్రోజన్ బాంబులను(సుతీల్ బాంబు) పేల్చడం వంటివి చేస్తున్నారు.
అయితే వాటికి చంపడం కంటే తినడమే మంచిదని ఆస్ట్రేలియాకి చెందిన పరిశోధకులు చెప్తున్నారు. అవి చాలా ప్రోటీన్ ఫుడ్ అని.. వాటిని తింటే చాలా వరకు ప్రోటీన్ లు మనిషికి లభిస్తాయని అంటున్నారు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు వీటిని ఆహారంగా తీసుకుంటారని అంటున్నారు. దక్షిణ అమెరికా దేశాలు మిడతల దండులను ఎదుర్కోవడానికి వాటిని తింటారని తెలిపారు. అందుకే భారతీయులు కూడా వాటిని చంపడం కంటే తినడం మంచిదని సూచిస్తున్నారు.