యూరియా తిని 22, ఇల్లు కూలి 15 మేకలు బలి..  - MicTv.in - Telugu News
mictv telugu

యూరియా తిని 22, ఇల్లు కూలి 15 మేకలు బలి.. 

October 13, 2020

Eat urea and no more 22 goats and 15 goats incident house collapsed.jp

కుండపోత వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా తల్లాడ  మండల కేంద్రంలో ఓ పెంకిటిల్లు పూర్తిగా నానిపోయి కూలిపోయింది. ఈ ఘటనలో 15 మేకలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ మేకల యజమాని తల బాదుకుని రోదిస్తున్నాడు. మరోవైపు తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో రాత్రినుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాథమిక పాఠశాల గొడ కూలిపోయంది. దీంతో పాఠశాలలోకి వరద నీరు చేరింది. పాఠశాలలో పంపిణీ చేయ‌డానికి సిద్ధంగా ఉంచిన బతుకమ్మ చీరలు, రేషన్ బియ్యం, పంచదార, కందిపప్పు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇదిలావుండగా మరో ఘటనలో పొటాష్‌, యూరియా తిని 22 మేకలు మృతిచెందాయి. 

ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్‌ మండలంలోని పురాణీపేట్‌లో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామానికి చెందిన మెండి శారదకు చెందిన మేకల మంద లింబాద్రి గుట్ట పరిసర ప్రాంతాల్లోకి మేతకు వెళ్లింది. అక్కడ ఉన్న పంట పొలాల వద్ద వాడి పడేసిన పొటాష్‌, యూరియాను మేకలు తిన్నాయి. దీంతో అవి రోడ్డు పైకి వచ్చి పడిపోయాయి. వాటిని చూసి మేకలు కాస్తున్న శారద కుమారుడు అరవింద్‌ తల్లికి చెప్పాడు.  వెంటనే వారు భీమ్‌గల్‌ పశు వైద్యశాలకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి వచ్చి వాటికి ప్రథమ చికిత్స అందించారు. మూడు మేకలు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడగా మిగితా 22 మేకలు చనిపోయాయి. రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు లబోదిబోమంటోంది.