నేటికాలంలో చాలామంది ఒత్తిడితో కూడిన జీవనశైలిని గడుపుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అధికరక్తపోటు, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అధిక బీపీతో కొంతమంది ప్రతివిషయంలోనూ కోపం తెచ్చుకోవడం, చిన్నపిల్లల్లోనూ బీపీ సమస్య ఎదురవుతుంది. దీంతోపాటు ఆందోళన వంటి సమస్య కూడా పెరుగుతోంది. అధికబీపీ, ఒత్తిడి వల్ల గుండెజబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో అవకాడో తినడం వల్ల అధిక బీపీ, ఒత్తిడికి చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఖాళీ కడుపుతో అవకాడో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఆందోళనను తగ్గించడంలో :
ఖాళీ కడుపుతో అవకాడో తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నాడీవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. అంతేకాదు ప్రతిరోజూ అవకాడో తినడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
2. జీవక్రియ రేటును పెంచుతుంది:
కడుపులో జీవక్రియ రేటును పెంచడంలో అవకాడో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ కడుపు పిత్త రసాన్ని ప్రోత్సహించడంతో పాటు జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది. ఇది పొట్టలో మెటబాలిక్ రేటును పెంచి ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల పొట్టలోని పిహెచ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయబడి, ఎసిడిటీకి చెక్ పెడుతుంది.
3. అధిక బిపికి అవకాడో:
అధిక BP సమస్యతో బాధపడేవారు, అవకాడో తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడోలో ఒలీక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అవోకాడోలో పొటాషియం, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉన్నాయి, ఈ రెండూ గుండెకు మేలు చేస్తాయి. కాబట్టి, ఈ ప్రయోజనాలన్నింటిని పొందాలంటే మీరు ఉదయం ఖాళీ కడుపుతో అవకాడో తినాలి.