చలికాలంలో జలుబు,దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్ధితుల్లో నువ్వులు బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బెల్లం శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. పంచదార కంటే బెల్లం తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. బెల్లంలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీరం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. బెల్లంలో ఫైబర్, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
బెల్లం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శీతాకాలంలో మీ రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండకూడదంటే..ప్రతిరోజూ బెల్లం తినడం మంచిది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు,ఇతర పోషకాలు మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచేలా చేస్తాయి.
2. ఆస్తమా రోగులకు మేలు చేస్తుంది.
ఆస్తమా రోగులు బెల్లం తినడం చాలా మంచిది. దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి.
3. చలి నుంచి రక్షిస్తుంది.
బెల్లంకు వేడెక్కించే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది చల్లని వాతావరణంలో దగ్గు, జలుబు నుంచి మిమల్ని దూరం చేస్తుంది. గొంతుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చికాకును తగ్గిస్తుంది. బెల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి బయటపడవచ్చు.
4. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
మీరు చలికాలంలో కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతుంటే..దాని నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజూ బెల్లం తినండి. కీళ్లనొప్పులు రాకుండా, ఎముకలు దృఢంగా ఉండేందుకు ఒక గ్లాసుపాలలో బెల్లం కలిపి తాగవచ్చు.