eating pickles daily may lead health problems
mictv telugu

నోరూరిస్తున్నా….తినకూడదు అంతే.

February 7, 2023

 eating pickles daily may lead health problems

వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో వేసుకుని అందులో ఇంత నెయ్యి వేసుకుని తింటే…అబ్బబ్బా చెప్తుంటేనే నోట్లోంచి నీళ్ళూరుతున్నాయి కదా.నిలవ పచ్చళ్ళు అయినా, రోటి పచ్చళ్ళు అయినా రోజూ ఏదో ఒకటి ఉండాల్సిందే. అందులోని తెలుగు వాళ్ళు అయితే నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కుంటారు. అన్నంలోనే కాదు ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. అయితే పచ్చళ్ళు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా…

బీపీ
పచ్చళ్ళు ఎక్కువగా తినడం అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా తినొచ్చు కానీ రోజూ తినకూడదని చాలా గట్టిగా చెబుతున్నారు. పచ్చడి అంటేనే అందులో ఉప్పు, కారం , నూనె అన్నీ ఎక్కువగా ఉంటాయి.నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది.బీపి ఉన్న వాళ్ళు పచ్చళ్ళు అస్సలు తినకూడదు. ఒక్కసారి తిన్నా వాళ్ళ బీపీ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు వస్తుంది.

ప్రిజర్వేటివ్స్‌ వల్ల

హైపర్‌ టెన్షన్‌ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్‌లో కొనుగోలు చేసే పచ్చళ్ళలో ప్రిజర్వేటివ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్ళు ఎక్కువగా తింటే కడుపులో పుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.

గుండెజబ్బులు

మార్కెట్‌లో అమ్మే పచ్చళ్ళకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఎక్కువ ఆయిల్‌ తీసుకోవడం వల్ల, మసాలాల కారణంగా, పైల్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్‌ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెజబ్బులను ఆహ్వానించినట్టే. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్ళను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్ళలో కలిపిన వాటిని… అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది.