Eating these fruits can check acidity
mictv telugu

ఈ పండ్లు తింటే అసిడిటికి చెక్ పెట్టొచ్చు..!!

February 12, 2023

Eating these fruits can check acidity

నేటికాలంలో చాలామంది ఎసిడిటి సమస్యతో బాధపడుతున్నారు. కొంచెం తిన్నా సరే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. పొట్టలో ఏం జరుగుతుందో అర్థం కాదు. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మరింత ఇబ్బంది పెడుతుంది. దీనంతటికి కారణం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ఒత్తిడికి ఇవన్నీ కూడా అసిడిటికి కారణం అవుతున్నాయి. కానీ కొన్నిసార్లు శరీరంలో pH స్థాయి లోపించినప్పుడు…శరీరంలో వేడి కారణంగా కూడా ఈ సమస్య చాలా కాలంపాటు ఇబ్బంది పెడుతుంది. అసిడిటి సమస్యకు కొన్ని రకాల పండ్లతో చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పండ్లతోపాటు శరీరానికి కావాల్సినంత నీరు తాగాలి. పండ్లలో శరీరాన్ని చల్లబరచడంతో పాటు ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడే హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి, ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టే పండ్లు ఏవో తెలుసుకుందాం.

అసిడిటీ వేధిస్తుంటే ఎలాంటి పండ్లు తినాలి. 
1. అరటిపండు:
అరటిపండులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి ఎసిడిటీ సమస్యకు చెక్ పెడతాయి. అరటిపండ్లలో ఉండే ఆల్కలీన్ లక్షణాలు పొట్టలో వేడిని తగ్గిస్తాయి. అంతేకాదు యాసిడ్ రిఫ్లక్స్ లేదా GERD లక్షణాలను నివారించడానికి సహాయపడుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు అరటిపండులో బ్లాక్ స్టాల్ వేసుకోని తింటే మంచిది.

2. యాపిల్:
యాపిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆల్కలైజింగ్ మినరల్స్ ఉన్నాయి. కడుపులో ఉండే ఆమ్లాన్ని ఇవి సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి స్టొమక్ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనితో పాటు ఉబ్బరం, పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఎసిడిటీ ఉన్నవారు రోజూ ఒక యాపిల్ తింటే చాలా మంచిది.

3. బేరి పండ్లు:
బేరి ఒక సిట్రస్ పండు. కానీ ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. వాస్తవానికి, ఇది శరీరంలోకి వెళ్లడం ద్వారా యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్ధకంతో ఇబ్బంది పడే వారికి బేరిపండ్లు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.

4. కొబ్బరి నీరు
అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి కొబ్బరినీళ్లు చాలా మేలు చేస్తాయి. కొబ్బరినీళ్లలో అత్యల్ప యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఉన్న పండ్లలో ఒకటి. కొబ్బరినీళ్లు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ప్రేగు కదలికలు, జీవక్రియలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.