జీరో క్యాలరీ షుగర్ తీసుకుంటున్నారా? చక్కెర కంటే డేంజర్..తాజా అధ్యయనంలో వెల్లడి..!! - MicTv.in - Telugu News
mictv telugu

జీరో క్యాలరీ షుగర్ తీసుకుంటున్నారా? చక్కెర కంటే డేంజర్..తాజా అధ్యయనంలో వెల్లడి..!!

March 3, 2023

ఈ మధ్యకాలంలో చాలా మంది బరువును అదుపులో ఉంచుకునేందుకు కృత్రిమ స్వీటెనర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది చక్కెర కంటే తక్కువ హానీకలిగిస్తుందని నమ్ముతారు. కానీ తాజా అధ్యయనంలో నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. ఎరిథ్రిటాల్ అని పిలిచే జోరో క్యాలరీ షుగర్ గుండెపోటు మానిఫోల్డ్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించింది. రక్తంలో ఎరిథ్రిటాల్ పెరుగుదల కారణంగా గుండెకు ప్రమాదాన్ని పెంచుతుందని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ పరిశోధన వెల్లడించింది.

క్లీవ్ ల్యాండ్ క్లినిక్ లెర్నర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ యునైటెడ్ కింగ్ డమ్, ఐరోపాలో స్వీటెనర్ తీసుకుంటున్న 4000మంది వ్యక్తుల రక్త నమూనాలను సేకరించ పరిశీలించింది. జీరో క్యాలరీ షుగర్ తీసుకుంటే ఎరిథ్రిటాల్ తక్కువ సమయంలో దాని ప్రభావాన్ని చూపుతున్నట్లు కనుగొన్నారు. జీరో క్యాలరీ షుగర్ తీసుకున్నవారి రక్తంలో ఎరిథ్రిటాల్ స్థాయి పెరుగుతూనే ఉన్నట్లు గమనించారు. దీని కారణంగా రక్తం గట్టిపడుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుందని పేర్కొంది. ఈ అధ్యయనం ఇటీవలే నేచర్ జర్నల్ లో ప్రచురించారు.

పరిశోధకులు అభిప్రాయం ప్రకారం…ఎరిథ్రిటాల్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టే స్వభావం కలిగి ఉంటుంది. ఇది ప్లేట్ లెట్స్ ను మరింతగా ప్రతిస్పందించేలా చేస్తుంది. అంటే 10శాతం కంటే తక్కువ ఎరిథ్రిటాల్ 90 నుంచి 100శాతం వరకు గడ్డకట్టడానికి కారణం అవుతుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అధ్యయనంలో ఒక సాధారణ కృత్రిమ స్వీటెనర్, ఎరిథ్రిటాల్, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నది.

జీరో షుగర్ జ్యూస్ తాగేవారిలో ఎక్కువ మొత్తంలో ఎరిథ్రిటాల్ తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్టాన్లీ హాజెన్ తెలిపారు. జీరో-షుగర్తో ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తారు. కానీ రక్తపు ప్లేట్‌లెట్స్ లోపల గడ్డకట్టే ధోరణిని ఇది పెంచుతుంది. తక్కువ లేదా జీరో కేలరీల స్వీటెనర్లు సురక్షితమైనవని చాలా కాలంగా చెబుతున్నారు. కానీ ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం సూచిస్తుంది.