దిగొచ్చిన ఎన్నికల సంఘం - MicTv.in - Telugu News
mictv telugu

దిగొచ్చిన ఎన్నికల సంఘం

October 25, 2017

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఆలస్యం చేసి విపక్షాల నుంచ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఆ షెడ్యూలును బుధవారం విడుదల చేసింది. రెండు దశల్లో డిసెంబర్‌ 9, 14న ఎన్నికలు నిర్వహిస్తారు.  18న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

మోదీ స్వరాష్ట్రం కావడంతో బీజేపీ ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ బీజేపీని దెబ్బకొడితే దేశమంతంటా ప్రభావం ఉంటుంది కనుక కాంగ్రెస్ కూడా పకడ్బందీగా పావులు కదుపుతోంది. 182 మంది సభ్యులు వున్న  అసెంబ్లీ గడువు 2018 జనవరి 23తో ముగియనుంది.  గుజరాత్‌ కంటే ముందుగా హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంపై ఈసీని విపక్షాలు దయ్యబట్టడం తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటన్న మోదీ సర్కారుకు ఊరటనిచ్చేందుకే ఈ పనిచేశారని విమర్శలు ఉన్నాయి.