రెండు చోట్ల పోటీకి ఈసీ చెక్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండు చోట్ల పోటీకి ఈసీ చెక్

April 4, 2018

ఎన్నికల ప్రక్రియ సంస్కరణ దిశగా ఈసీ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అభ్యర్థి ఎవరైనాసరే  ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీకి దిగాలన్న ప్రతిపాదనకు మద్దతు పలికింది. సుప్రీం కోర్టు ఆదేశంపై మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఒక అభ్యర్థి ఒకే చోట పోటీ చేయాలన్న సంస్కరణకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేయకుండా ఆదేశాలివ్వాలని బీజేపీ నేత, న్యాయావాది అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై  కోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి, సీఈసీల నుంచి స్పందన కోరింది. ప్రధాని స్థాయి వ్యక్తుల నుంచి గల్లీ లీడర్ల వరకు చాలామంది రాజకీయ నాయకులు ఓటమి భయంతో రెండుచోట్ల పోటీ చేస్తుండడం తెలిసిందే. వారు రెండు చోట్లా గెలిస్తే ఒకచోట ఖాళీ చేయడం, తర్వాత మళ్లీ ఉప ఎన్నిక జరపడం తంతుగా సాగుతోంది. దీని వల్ల ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండుచోట్ల పోటీ వద్దని ఉపాధ్యాయ్ కోరారు.