భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. దాని ప్రకారం.. జులై 5న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్, అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుంది. జులై 19 వరకు నామినేషన్ల దాఖలు, జులై 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
నామినేషన్ల ఉపసంహరణ జులై 22 వరకు, పోలింగ్ ఆగస్టు 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపును నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. కాగా, ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఇరు పక్షాలు తమ అభ్యర్ధుల చేత నామినేషన్లను దాఖలు చేయించాయి.