ఎంపీలకు ఈసీ షాక్..ఆ లిస్టులో మన తెలుగువారు కూడా..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీలకు ఈసీ షాక్..ఆ లిస్టులో మన తెలుగువారు కూడా..!

February 4, 2020

jhjhvf

ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికలు జరిగి పది నెలలు గడుస్తున్నా ఇంకా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకపోవడంతో వారిపై సీరియస్ అయింది. ఇప్పటి వరకూ వివరాలు ఇవ్వని 80 మంది ఎంపీల వివరాలను ఎలక్షన్ వాచ్ ప్రకటించింది. వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.  లేకపోతే తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు కూడా ఉన్నారు. వీరిలో 15 మంది ఏపీ ఎంపీలుగా కాగా ముగ్గురు తెలంగాణ వారు ఉన్నట్టుగా తేలింది. 

ఎన్నికల తర్వాత అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను 90రోజుల్లో ఈసీకి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 80 మంది ఎంపీలు ఆ సమాచారం ఇంకా ఇవ్వలేదు. చాలా కాలం పాటు వేచి చూసిన ఎలక్షన్ వాచ్ అధికారులు సీరియస్ అయ్యారు. ఖర్చు ఫైల్ చేయకుంటే.. తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం కూడా తమకు ఉందని తెలిపింది. కాగా ఈసారి ఎన్నికల ఖర్చులు భారీగానే ఉండటంతో ఆయా ఎంపీలు వాటిని సమర్పించడంలో తడబడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.