ECI list released..These parties were dissolved in Telangana
mictv telugu

తెలంగాణలో ఈ పార్టీలు రద్దు: ఈసీఐ

September 14, 2022

దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి రిజిస్టర్‌ అయిన 20 పార్టీలు కూడా ఉన్నట్టు మంగళవారం విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గుర్తింపులేని ఆరు పార్టీలను తొలగించింది. ఇక, దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌‌యూపీపీలుగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.

”తెలంగాణలో 14 ఆరో యూపీపీలను క్రియాశీలకంగా లేని పార్టీలుగా గుర్తించాం. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆరు పార్టీలను రద్దు చేశాం. మే 25న ఆర్‌ యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించాం. ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌ యూపీపీలుగా ప్రకటించాం. ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.” అని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.

తెలంగాణలో తొలగింపబడ్డ పార్టీలు ఇవే…

1. ఆల్‌ ఇండియా మహిళా డెమొక్రటిక్‌ ఫ్రంట్‌,
2. భారతీయ యువత, సమత, రాష్ట్రీయత కాంగ్రెస్‌ పార్టీ,
3. నవ తెలంగాణ పార్టీ,
4. ప్రజా చైతన్య పార్టీ,
5. త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ,
6 అఖండ్‌ భారత్‌ నేషనల్‌ పార్టీ,
7. అఖిలాంధ్ర మహాదేశం,
8. ఆలిండియా ముక్తిదళ్‌ పార్టీ,
9. ఆలిండియా ముత్తహిద్‌ క్యుయామి మహాజ్‌,
10. ఆంధ్రప్రదేశ్‌ నవోదయ ప్రజాపార్టీ,
11. భారత్‌ అభ్యుదయ్‌ పార్టీ,
12. మన పార్టీ,
13. నేషనలిస్ట్‌ తెలంగాణ రాష్ట్ర సమితి,
14. ప్రజా భారత్‌ పార్టీ,
15. ప్రజా పార్టీ,
16. ప్రజాశాంతి పార్టీ,
17. తల్లి తెలంగాణ పార్టీ,
18. యూత్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌,
19, సెక్యులర్‌ డెమొక్రటిక్‌ లేబర్‌ ఆఫ్‌ ఇండియా,
20. సురాజ్‌ పార్టీ.