ECI shock to KA Paul..Revocation of party recognition
mictv telugu

కేఏ పాల్‌‌‌కు ఈసీఐ బిగ్ షాక్..పార్టీ గుర్తింపు రద్దు

September 14, 2022

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు మీడియా సమావేశాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. గతకొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైని కలిసి, రాష్ట్రంలోని పలు సమస్యలపై ఆయన చర్చించారు. అంతేకాదు, ఆయా పార్టీల నాయకులను తమ పార్టీలో చేరితే, ఉన్నతమైన పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇటీవలే తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రజాశాంతి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం ఆయన అడుగులు వేయటం మొదలుపెట్టారు.

ఇటువంటి సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కేఏ పాల్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. మంగళవారం విడుదల చేసిన జాబితాలో ప్రజాశాంతి పార్టీని తొలగించింది. యాక్టివ్‌గా లేని పార్టీలను, వాటి కామన్ సింబల్ నిలిపివేస్తూ, నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజాశాంతి పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు షాక్ ఎదురైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై కేఏ పాల్ ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక, కేఏ పాల్ విషయానికొస్తే..క్రైస్తవ మత ప్రచారకుడుగా, శాంతిదూత‌గా ఆయన కొద్ది మందికే తెలుసు. కానీ, రాజకీయాల్లోకి కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. ఆయన మీడియా ముందు ఏది మాట్లాడినా, ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ జరుగాయి. దీంతో కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికి దగ్గరయ్యారు.

అంతేకాదు, సోష‌ల్ మీడియాలో కేఏ పాల్‌ క్రేజ్ మామూలుగా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ మీడియా సమావేశం ఎప్పడు పెట్టిన ఆయా న్యూస్ ఛానెల్స్ పాల్‌ను ఫాలో అయ్యి, రేటింగ్‌ను పెంచుకుంటాయి. కావాలని ఆయని ఏదో అంశంపై మాట్లాడేలా చేస్తాయి. అలాంటి వ్యక్తికి, ఆయన పార్టీకి ఈసీ ఘలక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.