చైనాకు భారీ షాక్ ఇచ్చిన కరోనా..ఒకే రోజు రూ. 28 లక్షల కోట్ల నష్టం - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు భారీ షాక్ ఇచ్చిన కరోనా..ఒకే రోజు రూ. 28 లక్షల కోట్ల నష్టం

February 4, 2020

vv

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ లక్షణాలు మెల్లమెల్లగా పొరుగు దేశాలకు సోకుతోంది. దీంతో చైనాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే చైనా వస్తువులపై వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడి ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తగ్గిపోయింది. దీని కారణంగా కేవలం ఒక్కరోజే రూ. 28 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అక్కడి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

వైరస్ వ్యాపించకుండా చైనా సరిహద్దులను ఆయా దేశాలు మూసివేశాయి. అక్కడి వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడంలేదు. చైనా నుంచి దిగుమతులు తగ్గించి వేస్తున్నాయి.  దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. దీని వల్ల అక్కడి కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రభుత్వం షాక్ అయింది. రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆ దేశం ఆందోళనను వ్యక్తం చేస్తోంది.  కాగా ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 425 మంది మరణించారు. 20వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.