Economist, former Planning Commission member Abhijit Sen passes away
mictv telugu

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత

August 30, 2022

ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ సోమవారం రాత్రి కన్నుమూశారు. 72 ఏళ్ల అభిజిత్ సేన్ కు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని, కానీ అప్పటికే అభిజిత్ సేన్ మరణించారని అతని సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ చెప్పారు.

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అభిజిత్ సేన్ నాలుగు దశాబ్దాల పాటు ఆర్థికశాస్త్రాన్ని బోధించారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన అభిజిత్ వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా అభిజిత్ సేన్ ఉన్నారు. ఆయనకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టుంది. బెంగాలీ కుటుంబానికి చెందిన సేన్ స్టీఫెన్స్ కళాశాలలో ఫిజిక్స్ హానర్స్ చదివి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేశారు. ఆర్థికవేత్త మృతిపై పలువురు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.