ED approaches Supreme Court against MLC Kavitha's Petition In Delhi Liquor Scam Case
mictv telugu

Delhi excise case: కవిత కేసులో సుప్రీంకు ఈడీ.. కేవియట్ పిటిషన్ దాఖలు

March 18, 2023

ED approaches Supreme Court against MLC Kavitha's Petition In Delhi Liquor Scam Case

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది.తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత కేసులో సుప్రీం కోర్టును ఈడీ ఆశ్రయించింది. మార్చి 24 సుప్రీంలో కవిత పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయొద్దంటూ ఈడీ అధికారులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరడంతో ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈనెల 11న కవిత ఈడీ అధికారులు మెుదటి సారి విచారించారు. దాదాపు 9 గంటల పాటు ఆమెను అధికారులు విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ సందర్భంగా ఆమె ఫోన్‌ను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఈనెల 16న మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు అందించారు. అయితే ఈడీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను వేధింపులకు గురి చేస్తుందని పిటిషన్‌లో వెల్లడించారు. 160 సెక్షన్ ప్రకారం మహిళలను ఇంటికి వచ్చి విచారించాలని అన్నారు. ఇతరులతో కలిసి విచారిస్తామని చెప్పిన ఈడీ అధికారులు.. అలా చేయలేదని అన్నారు. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు అయితే అత్యవసర విచారణ కుదరదని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం ఈనెల 24నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాను వేసిన పిటిషన్ సుప్రీంలో ఉందన కారణంగా ఈనెల 16న ఈడీ విచారణకు కవిత డుమ్మా కొట్టారు. మహిళలను ఇంటిదగ్గరే విచారించాలనే నిబంధనల ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇప్పుడీ పిటిషన్‌కు వ్యతిరేకంగానే సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఈడీ.