దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న అరెస్ట్లు ప్రకంపనలు సృస్టిస్తున్నాయి. కేసులో దూకుడు పెంచిన అధికారులు ప్రముఖ వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు మధ్యాహ్నం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరపర్చునున్నారు.
రెండ్రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో.. ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిసింది. ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. మరోవైపు పంజాబాబ్ కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 7 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ మద్యం కుంభకోణం కోసులో 9 మంది అరెస్ట్ అయ్యారు.