సీఎం మేనల్లుడి అరెస్ట్..
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు బ్యాంకులకు రూ. 354 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వచ్చాయి. మోసర్ బేర్ సంస్థకు రతుల్ పురి సీఈవోగా ఉన్న సమయంలో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
విచారణకు హాజరుకాకపోవడం వల్లే ఆయన్ను అరెస్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుపై సీబీఐ అధికారులు రెండు రోజుల పాటు ఆరు ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించారు. తర్వాత ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంపీ దీపక్ పురి,డైరెక్టర్స్ నీతా పురి,సంజయ్ జైన్,వినీత్ శర్మ కూడా ఉన్నారు. కాగా, మోసర్ బేర్ అనేది డిజిటల్ డేటా స్టోరేజ్ రంగంలో సేవలు అందించింది. కాంపాక్ట్ డిస్కులు,డీవీడీలు,స్టోరేజ్ డివైజ్‌లు ఇందులో తయారయ్యేవి.కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ సంస్థ మూతపడింది.