యస్ బ్యాంక్ కేసులో వాధవన్ సోదరులు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

యస్ బ్యాంక్ కేసులో వాధవన్ సోదరులు అరెస్ట్

May 14, 2020

Yes Bank

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రమోటర్లు కపిల్‌ వాధవాన్‌, ధీరజ్‌ వాధవాన్‌లను ఈడీ గురువారం అరెస్ట్‌ చేసింది. మనీల్యాండరింగ్‌ నిరోధక (పీఎంఎల్‌ఏ) న్యాయస్ధానం ఎదుట వీరిరువురిని హాజరుపరచగా.. కోర్టు పదిరోజుల కస్టడీకి తరలించింది. పలు సంస్ధలకు నిధుల మళ్లింపు, నిభంధనలకు వ్యతిరేకంగా రుణాలు ఇచ్చి సంస్థ తీవ్రంగా నష్టపోవటానికి కారణమైన ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను అరెస్టు చేశారు. అయితే తమను కూడా అరెస్టు చేస్తారని భయపడిన కపిల్‌ వాధవాన్‌, నీరజ్‌ వాధవాన్‌ సోదరులు ముంబై నుంచి పారిపోయారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ వారు మరో 12 మందితో కలిసి ఖండాలా నుంచి మహాబలేశ్వర్‌కు ప్రయాణించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘనల కింద వారిని ఏప్రిల్  26న మహా బళేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ క్వారంటైన్‌లో ఉంచారు. అనంతరం సీబీఐ వారిని కస్టడీలోకి తీసుకుంది.